తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఆలయంలో వరుస దొంగతనాలు... దర్యాప్తు చేస్తున్న పోలీసులు - జగిత్యాలలోని రామాలయంలో చోరీ

రాములోరి ఆలయంలో వరుసగా నాలుగోసారి చోరీ జరిగిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తాళలను ధ్వంసం చేసిన దుండగులు... రెండు హుండీలలోని నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు.

robbery-in-ramalayam-at-jagtial
ఆలయంలో వరుస దొంగతనాలు... దర్యాప్తు చేస్తున్న పోలీసులు

By

Published : Aug 31, 2020, 10:50 AM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో చోరీ జరిగింది. ఇనుపషట్టర్​లను కట్​చేసి, తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లిన దుండగులు...రెండు హుండీలలోని నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. ఉదయాన్నే ఆలయానికి తెరిచేందుకు వెళ్లిన పూజారి... చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు.

పోలీసులకు సమాచారం అందించగా... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో ఇప్పటికే నాలుగుసార్లు చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:జీఎస్టీ విషయంలో ఇవాళ ఒక నిర్ణయానికి రానున్న రాష్ట్రం

ABOUT THE AUTHOR

...view details