తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బస్​స్టాండ్​లో చోరీ... పోలీసుల దర్యాప్తు - నిర్మల్​ జిల్లా బస్సు డిపోలో దొంగతనం

నిర్మల్​ బస్​స్టాండ్​లో చోరీ జరిగింది. బస్​పాస్ కౌంటర్​లో నగదును దోచుకెళ్లారు.

robbery in nirmal district bus depot
బస్సు డిపోలో చోరీ... దర్యాప్తు చేపట్టిన పోలీసుల

By

Published : Sep 5, 2020, 10:23 AM IST

నిత్యం ప్రయాణికుల రాకపోకలతో కిటకిటలాడే నిర్మల్ ప్రయాణ ప్రాంగణంలో దొంగతనం జరిగింది. రిజర్వేషన్ ఇన్​ఛార్జ్​ టీవీ రమణ తెలిపిన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రిజర్వేషన్ కేంద్రం తలుపు తాళం పగలగొట్టి లోపలకు ప్రవేశించాడు. అక్కడ డ్రాలో ఉన్న బస్సుపాస్ జారీకి సంబంధించిన రూ. 2,880 నగదును అపహరించాడు.

గది పక్కనే ఏర్పాటు చేసిన సాయిబాబా చిత్రపటం వద్ద ఉన్న హుండీని సైతం తెరిచి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లాడు. బస్​స్టాండ్​లో దొంగతనం జరగడం వల్ల సిబ్బందితో పాటు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రమణ తెలిపారు. పట్టణ సీఐ శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణ ప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్​ సహించదు'

ABOUT THE AUTHOR

...view details