ఖమ్మం జిల్లా వైరా పాత బస్టాండ్ సమీపంలోని బాలాజీ జ్యూయలరీ దుకాణంలో చోరీ జరిగింది. షాపు తాళాలు పగులగొట్టి దుకాణంలోకి ఓ వ్యక్తి చొరబడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తనవెంట తెచ్చుకున్న బస్తాలో వెండి, బంగారు వస్తువులను తీసుకెళ్లాడు.
ఉదయాన్నే దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని... షాపు తాళాలు తీసి ఉండటాన్ని చూసి అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... వైరా సీఐ వసంత్ కుమార్, ఎస్సై సురేశ్‌తో కలిసి ఏసీపీ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంకు సమాచారం ఇవ్వగా.. వారు దుకాణంలో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసిన వైరా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.