తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'చరవాణి దొంగలను అరెస్టు చేసిన పోలీసులు' - cell phone

చరవాణిలు చోరీ చేస్తున్న ఇద్దరు సభ్యుల అంతర్​రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 22 సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

చరవాణి దొంగలు

By

Published : Apr 4, 2019, 10:59 PM IST

'చరవాణి దొంగలను అరెస్టు చేసిన పోలీసులు'
వికారాబాద్​ జిల్లా తాండూరులో చరవాణిలు దొంగతనం చేసున్న ఇద్దరు సభ్యుల అంతర్​రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రం కల్లూరు గ్రామానికి చెందిన ఎల్లప్ప, వడ్డే హనుమంతు గత కొంతకాలంగా పని పాట లేకుండా తిరుగుతున్నారు. ఖర్చులకు డబ్బుల కోసం ఫోన్ల దొంగతనాలు చేయడం ప్రారంభించారు. వచ్చిన నగదుతో జల్సాలు చేసేవారు.

22 ఫోన్లు స్వాధీనం

గురువారం దొంగతనం చేసిన చరవాణిని అమ్మటానికి స్థానిక రైల్వేస్టేషన్​లో అనుమానాస్పదంగా తచ్చాడారు. అనుమానం వచ్చిన పోలీసులు స్టేషన్​కు తీసుకెళ్లి ప్రశ్నించగా చరవాణిలు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని తాండురు డీఎస్పీ రామచంద్రుడు తెలిపారు. నిందితుల నుంచి 22 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని త్వరలో కోర్టు ముందు హారజపచనున్నారు. ఇవీ చూడండి:సోనియాపై బరిలో కాంగ్రెస్​ మాజీ నేత!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details