రాయదుర్గం ఠాణా పరిధి బీఎన్ఆర్ హిల్స్ లోని వ్యాపారి మధుసూద్ రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో నేపాల్‌కి చెందిన మరో ఇద్దరితోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 5న రాత్రి ఆహార పదార్ధాల్లో మత్తు మందు కలిపిన జానకి సహా చోరీలో పాల్గొన్న చక్రబౌల్, ఉత్తర్‌ప్రదేశ్ బోర్డర్ వద్ద మత్తు మందులు సరఫరా చేసిన అఖిలేశ్ కుమార్‌లను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆహార పదార్థాల్లో మత్తు మందు ఇచ్చి దోచుకెళ్లారు - నమ్మిన ఇంటికే కన్నం
వారంతా పొరుగు రాష్ట్రాలు, మరో దేశానికి సంబంధించిన వ్యక్తులు.. పనికావాలని నమ్మకంగా ఇంట్లోకి చేరుతారు. చివరికి నమ్మిన ఇంటికే కన్నం వేస్తారు. యాజమానులను నమ్మించి వారికి ఆహార పదార్థాల్లో మత్తు మందు ఇచ్చి దోచుకెళ్తారు. అలాంటి సంఘటనే రాయదుర్గం ఠాణా పరిధిలో జరిగింది. ఆ ముఠాలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆహార పదార్థాల్లో మత్తు మందు ఇచ్చి దోచుకెళ్లారు
ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి 8.3 తులాల బంగారం, రూ.17 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని మాధాపూర్ ఇంఛార్జి డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :వ్యభిచారగృహంపై దాడి.. ఎనిమిది మంది అరెస్టు