లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్లో రోడ్డు ప్రమదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ కంటే ముందు నిత్యం సగటున 12 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా.. ఇప్పుడా సంఖ్య ఒకటికి తగ్గినట్లు తాజాగా ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది.
కరోనా ఎఫెక్ట్... అప్పుడు 12 ఇప్పుడు 01 - corona effect on road accidents latest news
కరోనా నేపథ్యంలో రాష్ట్ర సర్కారు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తోంది. రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరిగేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాకపోకలు ఎక్కడికక్కడ బంద్ కావడంతో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
corona effect on road accidents at Hyderabad latest news
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల నివారణపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హాట్‌స్పాట్‌లను గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ కంటే ముందు(జనవరి 1 నుంచి మార్చి 21 వరకు).. ఆ తర్వాత(మార్చి 22-ఏప్రిల్ 22 వరకు) ప్రమాదాల తీవ్రతపై అధ్యయనం చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు క్షతగాత్రుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించారు.
TAGGED:
eenadu