ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బైక్‌పై ముగ్గురు వ్యక్తులు సంగారెడ్డి పాత బస్టాండు నుంచి పోతిరెడ్డిపల్లి వైపు వెళుతుండగా రహదారి పక్కన ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీ కొట్టారు.
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్.. ఒకరు మృతి! - సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.