మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్రల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతిచెందారు. ప్రమాద సమయంలో లారీలో 11 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుతండాకు చెందిన హర్యా, గోవిందర్, మధు, ధూర్యాలుగా గుర్తించారు. ప్రమాదంలో ఏడుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం - మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రోడ్డు ప్రమాదం
మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం
06:44 July 16
కర్రలోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి నలుగురు మృతి
Last Updated : Jul 16, 2020, 8:49 AM IST