గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలోని వన్మోర్ నగర్ వద్ద ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి తనకు తాను జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తోన్న ఆటో, మరో ద్విచక్రవాహనంపై నున్న వారు అతన్ని తప్పించే క్రమంలో ఒకరికొకరు ఢీ కొని స్వల్పంగా గాయపడ్డారు. అయితే అంబులెన్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ... పోలీసులు వచ్చే వరకూ క్షతగాత్రున్ని తరలించకుండా అరగంటపాటు అలాగే ఉంచారని బంధువులు ఆరోపించారు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బందే అతను చనిపోవడానికి కారణమని వారితో వాగ్వాదానికి దిగారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి - one men
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు . అతని మరణానికి పోలీసులే కారణమని బంధువుల ఆందోళన.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి