నల్గొండ జిల్లా దామరచర్ల మండలం అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై బైక్ అదుపు తప్పిన ఘటనలో నాగార్జున రెడ్డి (24) అనే వ్యక్తి మృతి చెందాడు. నెల్లూరు నుంచి వరంగల్‌కు బైక్‌పై అతి వేగంగా వెళ్తూ వాడపల్లి గ్రామ శివారులో టిప్పర్ లారీని అధిగమించబోయి ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలు కాగా యువకుడు మృతి చెందాడు.
అతివేగం: బైక్ అదుపు తప్పి యువకుడు మృతి - నల్గొండలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అతివేగంగా వెళ్లాడు. ముందున్న వాహనాన్ని అధిగమించాలని యత్నించాడు. దురదృష్టవశాత్తు బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. చివరికి మృత్యువాత పడ్డాడు. నల్గొండ జిల్లా అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
అతివేగం: బైక్ అదుపు తప్పి యువకుడు మృతి
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:విషాదం: కారును ఢీకొన్న ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి