హైదరాబాద్ గోషామహల్ పోలీస్స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ.. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడు గుడిమల్కాపూర్ నివాసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్.. పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. లారీని సీజ్ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.