యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి చెరువు కట్ట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, డీసీఎం వ్యాన్ను ఢీకొనడం వల్ల ఇద్దరికి గాయాలయ్యాయి. రెండు వాహనాలు హైదరాబాద్ నుంచి జనగామ వైపు వెళ్తున్నాయి.
రోడ్డు ప్రమాదం: అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టిన బొలెరో - యాదాద్రి జిల్లా తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం టైర్ పంచర్ కావడం వల్ల.. అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదం: అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టిన బొలెరో
బొలెరో వాహనం టైర్ పంచర్ కావడం వల్ల వాహనం అదుపు తప్పి ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని పక్కనుంచి ఢీకొట్టింది. దీనితో డీసీఎం వాహనం రోడ్డు పక్కన బోల్తా పడింది. డీసీఎం వాహనంలో ఉన్న కూరగాయలు రోడ్డుపై పడిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు వాహనాల డ్రైవర్లకు గాయాలయ్యాయి. వాహనాల్లో ఉన్న మిగిలిన వారికి ఎలాంటి గాయాలు కాలేదు. గాయపడ్డ ఇద్దరు డ్రైవర్లను చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.