సూర్యాపేట జిల్లా నాగారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లికూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతుండగా జనగామ వైపునుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వారిని ఢీకొట్టింది.
రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. ప్రమాదంలో తల్లిబిడ్డ.. - సూర్యాపేట జిల్లా నేర వార్తలు
రోడ్డు దాటాలనుకునే లోపే ప్రమాదం ఎదురైంది. వేగంగా వచ్చిన కారు వారిని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా నాగారం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

రోడ్డు దాటుతుండగా కారు ఢీ...తల్లికూతుళ్లకు తీవ్ర గాయాలు
దీంతో షేక్ ఆశా అనే మహిళ ఎగిరి కారు అద్దానికి బలంగా తాకడంతో తలకు తీవ్ర గాయలవ్వగా.. ఆమె కుమార్తెకు చేయి విరిగింది. ఆశా పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.