సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి - latest road accidents suryapeta
17:52 July 24
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దులచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కృష్ణా జిల్లా కృత్తివేలు మండలం ఇంటేరుకు చెందిన నాగ కోటేశ్వరరావు, దుర్గ, మొగులమ్మ, కొండబాబు కారు కిరాయి తీసుకొని సొంతూరు నుంచి హైదరాబాద్కు కూలి పనులు చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. మొద్దులచెరువు వద్ద కాలకృత్యాల నిమిత్తం కారు దిగి రోడ్డు పక్కకు నిల్చోగా వెనుక నుంచి మరో కారు నలుగురిని ఢీకొట్టింది. ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం వల్ల కోదాడ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో పది సంవత్సరాల బాలిక ఉంది. ఘటనా స్థలిని మునగాల సీఐ శివశంకర్ గౌడ్ పరిశీలించారు.