సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన రాము, రాజు రెడ్డి, బాలాజీలు ఒకే బైక్‌పై సిద్దిపేట వైపు నుంచి మియాపూర్ వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది.
టిప్పర్, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి - siddipet district latest news
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా... ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
టిప్పర్, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి
ఈ ప్రమాదంలో రాము(26) అక్కడికక్కడే మృతి చెందగా... మిగతా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గౌరారం పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. 108 వాహనంలో క్షతగాత్రులను గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: 'వ్యవసాయ చట్టాల రద్దు ప్రజాస్వామ్యానికే ప్రమాదం'