తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

స్థంభాన్ని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. బాలుడు మృతి - మేడ్చల్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం

అధిక వేగం ఓ​ బాలుడి ప్రాణాలు తీయగా మరో బాలికను ప్రాణాపాయంలోకి నెట్టింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న స్థంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదం మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Breaking News

By

Published : Jan 10, 2021, 5:13 PM IST

ద్విచక్రవాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న స్థంభానికి ఢీ కొట్టిన ఘటన మేడ్చల్​ జిల్లా షామీర్​పేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ గుర్తు తెలియని​ బాలుడు మృతి చెందగా మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

జిల్లాలోని బొమ్మరాసిపేట నుంచి జగన్ గూడ వైపు వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి పంపించారు.

ఇదీ చదవండి:'అడాప్ట్ ఏ పెట్' కార్యక్రమానికి విశేష స్పందన

ABOUT THE AUTHOR

...view details