తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మిత్రునితో బయటకు వెళ్లి తిరిగిరాని లోకాలకు... - సికింద్రాబాద్​లో రోడ్డు ప్రమాదం

గోపాలపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మిత్రునితో ఆదివారం బయటకు వెళ్లి ఓ విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు స్నేహితులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా ఆకాశ్​ మల్లిక్​ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా... నికిత్​ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు.

road-accident-in-secunderabad-one-dead-one-person-injured
మిత్రునితో బయటకు వెళ్లి తిరిగిరాని లోకాలకు...

By

Published : Oct 27, 2020, 9:20 AM IST

సికింద్రాబాద్​లో గోపాలపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో ఇంటికి వెళ్లాల్సిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా... మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు.

ఏం జరిగిందంటే...

పశ్చిమబంగ తినిగిరి జిల్లా టౌన్​లోని నేతాజీనగర్‌కు చెందిన ఆకాశ్ మల్లిక్.. నాలుగేళ్లుగా నాచారం హెచ్ఎంటీ కాలనీలో నివాసం ఉంటూ ఐఐసీటీలో పీహెచ్​డీ చేస్తున్నారు. గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న స్నేహితుడు నికిత్​తో కలిసి ఆదివారం బయటకు వెళ్లారు. తిరిగి ఇంటివద్ద ఆకాశ్​ను విడిచిపెట్టేందుకు నికిత్ తన ద్విచక్రవాహనంపై సోమవారం తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో బయలుదేరారు. సికింద్రాబాద్ వైఎంసీఏ నుంచి తార్నాక నాచారం వైపుకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందారు. నికిత్​కు తీవ్రంగా గాయాలయ్యాయి.

కేసు నమోదు..

ఈ విషయాన్ని తెలుసుకున్న గోపాలపురం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన నికిత్​ను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్ష కోసం ఆకాశ్​ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:మహిళతో ఘర్షణ...అడ్డంగా దొరికిపోయిన రౌడీ షీటర్

ABOUT THE AUTHOR

...view details