సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు మండలం పాటి వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బాహ్యవలయ రహదారిపై గుర్తుతెలియని వాహనం కారును ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద ధాటికి ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం - road accident at sangareddy district
![ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం sangareddy road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9493440-304-9493440-1604970984508.jpg)
05:39 November 10
ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటినా చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు ఉత్తర ప్రదేశ్, ఝార్ఖండ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. బెంగళూరు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని భావిస్తున్న పోలీసులు.. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతుల వివరాలు..
మృతులు ఝార్ఖండ్ రాష్ట్రం రాంగఢ్ వాసులు కమలేశ్ లోహరే, హరి లోహరే, ప్రమోద్ భుహెర్, వినోద్ భుహెర్, గోరఖ్‌పూర్‌కు చెందిన పవన్ కుమార్, డ్రైవర్ బంగ్లాదేశ్‌కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులు గోరఖ్‌పూర్‌కు చెందిన ప్రమోద్ కుమార్, అర్జున్, ఆనంద్‌కుమార్, చంద్రవంశీగా గుర్తించారు.