ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు విజయవాడకు చెందిన పులి ప్రవీణ్ కుమార్, పర్ణసాయి, కొత్తగూడెంకు చెందిన భరత్‌గా గుర్తించారు.
చెట్టును ఢీకొన్న కారు...ముగ్గురు యువకులు మృతి - మారేడిమిల్లి రోడ్డు ప్రమాదం
కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వద్ద జరిగింది. ప్రమాదంలో మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.
చెట్టును ఢీకొన్న కారు...ముగ్గురు యువకులు మృతి
వీరంతా పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు విజయవాడ నుంచి మారేడుమిల్లి బయల్దేరినట్లు సమాచారం. కాసేపట్లో గమ్యాన్ని చేరుకుంటారనగా ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: బోదకొండ జలపాతంలో పడి మైనర్ బాలుడు మృతి