తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక లారీ.. వృద్ధురాలు మృతి.. - పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం లేటెస్ట్​ వార్తలు

ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

road accident in peddapalli district
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక లారీ.. వృద్ధురాలు మృతి..

By

Published : Nov 10, 2020, 10:56 AM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం ఇసుక లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. నర్సంపేట మండలం నక్కినపెల్లి గ్రామానికి చెందిన జమాల్ తన తల్లి ముత్తమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కూనారం క్రాస్ రోడ్డు వద్ద రహదారి దాటుతుండగా ఇసుక లారీ ఢీకొంది.

ఈ ప్రమాదంలో ముత్తమ్మ అక్కడికక్కడే మృతి చెందగా జమాల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పెద్దపెల్లి ఎస్సై రాజేశ్​ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఓఆర్​ఆర్​పై రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details