తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పదరలో కారు ఢీకొని ఆరేళ్ల పాప మృతి - పదరలో కారు ఢీకొని పాప మృతి

నాగర్ కర్నూల్ జిల్లా పదరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పదరలో కారు ఢీకొని ఆరేళ్ల పాప మృతి
పదరలో కారు ఢీకొని ఆరేళ్ల పాప మృతి

By

Published : Nov 13, 2020, 6:32 PM IST

కారు ఢీకొని ఆరేళ్ల పాప మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మద్దిమడుగు నుంచి అమ్రాబాద్ వైపు అతివేగంగా వచ్చిన కారు... బాలికను బలంగా ఢీకొట్టింది. ఘటనాస్థలిలో పాప అక్కడికక్కడే మృతి చెందింది.

బాలిక తల్లిదండ్రులు మృతదేహం వద్ద బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి: వాతావరణ మార్పులతో కొండంత విషాదం

ABOUT THE AUTHOR

...view details