నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఎస్ఓగా విధులు నిర్వర్తించే లింగాల అనంతరావు తన కారులో జిల్లా కేంద్రం నుంచి కూతురు, కుమారుడిని తీసుకొని సిరికొండకు బయలుదేరారు.
కారును వెనుక నుంచి డీసీఎం ఢీ.. అదుపుతప్పి వాగులో బోల్తా - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
వంతెన పైనుంచి వెళ్తున్న కారును వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టడం వల్ల అదుపుతప్పి వాగులో బోల్తా పడిన ఘటన గురువారం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
లింగాపూర్ వంతెన పైకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన వ్యాను వీరు ప్రయాణం చేస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పి కారు వాగులోకి వెళ్లింది. అనంతరావు కారు తలుపులు తెరిచి స్వల్ప గాయాలైన ఇద్దరు పిల్లల్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వాగులో నీటి ప్రవాహం తక్కువగా ఉండటం వల్ల ప్రాణాపాయం తప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: రెండుపడక గదుల ఇళ్లను భట్టికి రేపు కూడా చూపిస్తా : తలసాని