తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లారీని ఢీకొన్న కారు...ఇద్దరు మృతి - నిజామాబాద్ జిల్లా సమాచారం

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుకునూర్ గేట్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్​ను ఓవర్​ టేక్​ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

road accident in nizamabad dist two persons died five injured
లారీని ఢీకొన్న కారు...ఇద్దరు మృతి

By

Published : Nov 22, 2020, 3:32 PM IST

కోరుట్ల నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న ట్రాక్టర్​ను ఓవర్​ టేక్​ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుకునూర్​ గేట్ వద్ద దుర్ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, ఆకస్మాత్తుగా బ్రేక్​ వేయడంతో ట్రాక్టర్​ బోల్తా కొట్టింది. మృతులను వేములవాడ ప్రాంతవాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఆర్మూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కేటీఆర్​ ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించారు... ఎస్​ఈసీకి భాజపా ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details