ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది.
డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి - తెలంగాణ నేర వార్తలు
నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు బస్‌డిపో వద్ద డివైడర్‌ను ఢీకొట్టారు. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి
నిర్మల్ పట్టణంలోని పాన్గల్లీకి చెందిన హస్నన్(20), నోమన్(20) ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి బస్‌డిపో సమీపంలో డివైడర్‌ను ఢీ కొట్టారు. ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.