సూర్యాపేట-జనగామ జాతీయ రహదారి రోడ్డుప్రమాదం జరిగింది. నాగారం శాంతినగర్‌కు చెందిన షేక్ సైదులు ద్విచక్రవాహనంపై అర్వపల్లికి వెళ్లి వస్తున్న క్రమంలో ప్రగతినగర్ వద్ద కట్టెల లోడుతో ఆగిఉన్న ట్రాక్టర్ వెనుక భాగం ఢీకొన్నాడు. ప్రమాదంలో ఛాతికి బలమైన దెబ్బతగిలి సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు.
ట్రాక్టర్‌ను ఢీ కొన్న ద్విచక్రవాహనం.. ఒకరు మృతి - సూర్యాపేట జిల్లా నేర వార్తలు
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక భాగం నుంచి ద్విచక్ర వాహనం ఢీ కొట్టి వాహనదారు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
ట్రాక్టర్‌ను ఢీ కొన్న ద్విచక్రవాహనం.. ఒకరు మృతి
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి శవపరీక్ష నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సైదులు కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.హరికృష్ణ తెలిపారు.