తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలు - రోడ్డు ప్రమాదం వార్తలు నర్సాపూర్​

మెదక్​ జిల్లా నర్సాపూర్​ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్​ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనంపై హైదరాబాద్​ వెళ్తుండగా నర్సాపూర్​ వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది.

రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలు

By

Published : Nov 21, 2020, 9:45 PM IST

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలైన ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణ సమీపంలో జరిగింది. హవేలిఘనపూర్‌కు చెందిన భార్యభర్తలు ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌ వైపు వెళ్తుండగా నర్సాపూర్‌ వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి డీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని హైదరాబాద్​ సమీపంలో గల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు కాస్త ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది.

ఇదీ చదవండి:200కిలోల గంజాయి స్వాధీనం... నలుగురు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details