నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ లారీని చెట్టుకు ఢీ కొట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం ముత్యంపేట్-దొనబండ మార్గం మధ్యలో జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ జైతు, క్లీనర్ రమేష్లకు తీవ్ర గాయాలయ్యాయి.
చెట్టును ఢీ కొట్టిన లారీ.. ఇద్దరికి తీవ్రగాయాలు - మంచిర్యాల జిల్లాలో లారీ ప్రమాదం
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని 63వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జిల్లాలోని ర్యాలీగడ్పూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ ఆత్రం జైతు, క్లీనర్ మాండవి రమేష్ AP 07 TH 8023 నంబర్ గల లారీలో వేరే ప్రాంతానికి వెళుతున్నారు. ఆ క్రమంలో హాజీపూర్ మండలం 63వ జాతీయ రహదారిలోని ముత్యంపేట్-దొనబండ మార్గం మధ్యలో నిద్రమత్తులో ఉన్న జైతు రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో సుమారు మూడు గంటల తర్వాత జేసీబీ సహాయంతో బయటకు తీసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:ఈనెల 11న మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష