మహబూబాబాద్ జిల్లా కురివి రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కోళ్లఫారంలో పనిచేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురుని కారు ఢీకొట్టింది. ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలానికి చెందిన రమేశ్, స్వామి, రజిత మృతి చెందారు.
ద్విచక్రవాహనం, కారు ఢీ... ముగ్గురు మృతి - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
మహబూబాబాద్ జిల్లా కురివి రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోళ్లఫారంలో పనిచేసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురిని కారు ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ద్విచక్రవాహనం, కారు ఢీ... ముగ్గురు మృతి
వీరిలో రమేశ్(40) అక్కడికక్కడే మృతి చెందగా, రజిత(18) మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తీవ్రగాయాల పాలైన స్వామిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. సమాచారం అందుకున్న వారి బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.