ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. సత్తుపల్లి డిపోకు చెందిన బస్సు ఖమ్మం వెళ్తూ... ఎదురుగా ఉన్న వాహనాన్ని దాటిస్తూ అదుపు తప్పి చెట్టుకు ఢీకొంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో బస్సు... మొదటి బస్సును ఢీకొంది. ఈ ఘటనలో సత్తుపల్లి బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ... - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 15మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ...
రెండు బస్సులు ఢీకొనడంతో జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ని నియంత్రించారు.
ఇదీ చదవండి:భద్రాచలం ఏజెన్సీలో పులి సంచారం...!