కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మోడేగాం గ్రామానికి చెందిన దంపతులు మృతి చెందారు. అప్పుడే ప్రేమవివాహం చేసుకున్న భట్టు ప్రభాకర్, మహిమ.. బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలోనే నవ దంపతులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
అప్పుడే పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే అనంత లోకాలకు.. - కామారెడ్డి జిల్లా వార్తలు
ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సరదాగా, సంతోషంగా జీవితం గడపాలని ఎన్నో కలలు. కొత్త ప్రయాణంలో అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుదాం అనుకున్నారు. వాళ్ల అన్యోనత చూసి విధికి కూడా ఈర్ష్య పుట్టిందేమో.. మృత్యువు రూపంలో వాళ్లని మింగేసింది.
అప్పుడే పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే అనంత లోకాలకు..
ప్రమాదంలో మహిమ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రభాకర్ మరణించాడు.