కారు, ఆటో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ వంతెనపై ఈ దుర్ఘటన జరిగింది.
కాగజ్నగర్ వంతెనపై కారు, ఆటో ఢీ... ఒకరు దుర్మరణం - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా...మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పట్టణంలోని ప్రధాన రహదారిపై కారు, ఆటో ఎదురురెదురుగా ఢీకొన్నాయి.

కాగజ్నగర్ వంతెనపై కారు, ఆటో ఢీ... ఒకరు దుర్మరణం
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న దహేగం మండలం బోర్లకుంట గ్రామానికి చెందిన జమ్మిడి సోమయ్య, ఆయన కూతురు వర్షిని, పట్టణానికి చెందిన జాడి భీం రావు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా...చికిత్స పొందుతూ సోమయ్య మరణించాడు. భీం రావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.