జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒక డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వాహనాల్లో చిక్కుకున్న ఇద్దరూ సుమారు గంట పాటు నరకయాతన అనుభవించారు.
కొండగట్టు సమీపంలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి - జగిత్యాల జిల్లా రోడ్డు ప్రమాదం
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అతి కష్టం మీద ఇద్దరు డ్రైవర్లను బయటకు తీశారు. అందులో ఒకరు మరణించగా.. గాయపడిన మరొకరిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.