తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి - guntur latest news

తెలంగాణా నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్న కారు గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెం వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కాల్వలోకి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. నలుగురిలో ఇద్దరు తెలంగాణ, మరో ఇద్దరు ఉత్తరర్​ప్రదేశ్​కు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

By

Published : Oct 16, 2020, 3:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలంలో కారు ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. అద్దంకి - నార్కట్ పల్లి రహదారిలోని తంగేడు మల్లి మేజర్​లో కారు బోల్తా పడి నలుగురు వ్యక్తులు నీట మునిగి మృతి చెందారు.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

తెలంగాణా నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్న కారు రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెం వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కాల్వలోకి బోల్తా కొట్టింది. సమాచారం తెలుసుకున్న రొంపిచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

నలుగురిలో ఇద్దరు తెలంగాణ, మరో ఇద్దరు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వారిగా గుర్తించారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన బీరు గౌడ్, అతని కుమారుడు బాలాజీ మృతి చెందారు. మిగతా ఇద్దరు యూపీ వాళ్లు.

కారు డ్రైవర్​, యజమాని మాధవ్​ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. మాధవ్​కు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈయన ప్రకాశం జిల్లా పామూరు మండలం రాయపట్నం వాసిగా గుర్తించారు. ఇళ్లకు రంగులు వేయించేందుకు కూలీలను తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండి:రొంపిచర్ల ప్రమాదం: పొట్టకూటి కోసం వెళ్తే... కబళించిన మృత్యువు

ABOUT THE AUTHOR

...view details