ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం పాత స్టేట్‌బ్యాంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా తూర్పు గోదావరి జిల్లా ఉండి సమీపంలోని కొత్తపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. చెన్నై నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. నిద్రమత్తులోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం - కృష్ణా జిల్లా తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం పాత స్టేట్‌బ్యాంక్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం