యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొర్రెలగూడెం స్టేజి వద్ద రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని టాటాఏస్ వాహనం ఢీ కొనింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కాగా అక్కడి ప్రమాద వివరాలు సేకరిస్తున్న నిలుచుని ఉన్న కానిస్టేబుల్ జగన్నాథాన్ని మరో వాహనం వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది.
చౌటుప్పల్‌లో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు - చౌటుప్పల్‌లో రోడ్డు ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా బొర్రెలగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదస్థలంలో వివరాలు సేకరిస్తున్న కానిస్టేబుల్‌ను వెనుక నుంచి వచ్చిన మరో టాటాఏస్ వాహనం ఢీ కొట్టింది. అతన్ని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.
చౌటుప్పల్‌లో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
దానితో అతను తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు జగన్నాథాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం.. ఎనిమిది మంది మృతి