నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్, శ్రీరాంపూర్ గ్రామాల మధ్య 44వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లగా.. జాదవ్ కల్పన అనే 26 ఏళ్ల వివాహిత అక్కడిక్కడకే మృతి చెందింది.
గుర్తు తెలియని వాహనం ఢీ.. వివాహిత మృతి - 44వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం
ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వివాహిత అక్కడిక్కడకే మృతి చెందింది. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై జక్రాన్‌పల్లి వెళ్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
గుర్తు తెలియని వాహనం ఢీ.. వివాహిత మృతి
నిర్మల్ జిల్లా మామడ మండలం ఆరేపల్లికి చెందిన కల్పన.. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై జక్రాన్‌పల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:డీసీఎంను ఢీకొన్న బొలెరో.. ఒకరి మృతి