తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదం: కారు ఢీకొని అక్కాచెల్లెళ్లు మృతి - Road accident latest news

నాగర్​కర్నూల్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు అక్కచెల్లెళ్లను కారు ఢీకొట్టింది. ఈఘటనలో వారు అక్కడిక్కడే మృతి చెందారు.

road accident at Weldanda mandal in nagar karnool district
road accident at Weldanda mandal in nagar karnool district

By

Published : Sep 30, 2020, 10:55 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై నడుచుకుంటూ... వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడిక్కడే మృతి చెందింది.

వెల్దండకు చెందిన బాలకిష్టమ్మ (60), కళమ్మ (50) అనే అక్కచెల్లెళ్లు పొలం పనులకు వెళ్లి తిరిగి తమ ఇంటికి చేరుకునే క్రమంలో కారు ఢీకొట్టి మృత్యువాతపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఎన్నికల కోడ్​ పాటించని తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details