తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కారు టైరు​ పేలి ప్రమాదం.. యువకుడి మృతి.. - కరీంనగర్​ జిల్లా వార్తలు

కారు టైరు​ పేలి ప్రమాదం జరిగిన ఘటన కరీంనగర్​ జిల్లా వెంకటయ్యపల్లిలో జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు.

road accident at venkaraiahpally in karimngar district
కారు టైరు​ పేలి ప్రమాదం.. యువకుడి మృతి..

By

Published : Nov 23, 2020, 5:05 AM IST

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం వెంకటయ్యపల్లి సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. జగిత్యాల శివవీధిలో ఉంటున్న వినిత్‌తో అతని స్నేహితులు భగీరథ్‌, కార్తిక్‌, నితిన్‌ కారులో ఓ శుభాకార్యానికి వెళ్లారు.

తిరిగి వస్తుండగా ముందు టైరు పగిలి కారు బోల్తాపడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో వినిత్‌ మృతి చెందగా అతిని స్నేహితులు గాయపడ్డారు.. వారిని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి:కారులో చెలరేగిన మంటలు... ప్రయాణికులు సురక్షితం

ABOUT THE AUTHOR

...view details