కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపుగా వెళ్తోన్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీనితో బైక్పై ఉన్న వ్యక్తి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
కారు బైక్ ఢీ.. ద్విచక్ర వాహనదారుడికి గాయాలు - కామారెడ్డి జిల్లా బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
కామారెడ్డి జిల్లా టేక్రియాల్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అటుగా వేగంగా వెళ్తోన్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొనిగా వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని అంబులెన్స్ తెప్పించి బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన కిష్టయ్యగా గుర్తించారు.
ఇదీ చూడండి :పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు