హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఫార్చునర్ కారు ఖైరతాబాద్ నుంచి సచివాలయం వైపు వస్తుండగా ప్రమాదం సంభవించింది. ఎన్టీఆర్ గార్డెన్ రోడ్డుపై వరద నీరు నిలిచిపోవటంతోపాటు చెట్టు పడిపోవడం వల్ల కారు అద్దాలపై వర్షపు నీరు పడి ముందు కనిపించలేదు.
ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్డు ప్రమాదం - latest road accidents in hyderabad
కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్డు ప్రమాదం
దీంతో ఫార్చునర్ కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో ట్రాఫిక్‌కు స్పల్ప అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి:అప్పుల బాధతో ఒకరు, కుటుంబ కలహాలతో మరొకరు ఆత్మహత్య