ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని సాయిపల్కు చెందిన రామన్న, నరేష్‌తో పాటు రామన్న తమ్ముడి కొడుకైన సంతోష్(9) బైక్‌పై ఆదిలాబాద్ వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో పొన్నారి గ్రామశివారులో టిప్పర్ ఢీకొంది.
పొన్నారి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - ఆదిలాబాద్ జిల్లా క్రైం వార్తలు
తాంసి మండలం పొన్నారి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని టిప్పర్ ఢీకొట్టగా ఇద్దరు మృతి చెందారు. మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు.

పొన్నారి సమీపంలో రోడ్డు ప్రమాదం
ఈ ఘటనలో అక్కడిక్కడే రామన్న, సంతోష్ మృతిచెందగా నరేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరగ్గానే టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. గ్రామీణ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పొన్నారి సమీపంలో రోడ్డు ప్రమాదం