తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పల్టీలు కొట్టిన కారు.. నలుగురికి తీవ్ర గాయాలు - శంషాబాద్​ ఓఆర్​ఆర్​ వద్ద రోడ్డు ప్రమాదం

కారు అతివేగంతో వెళ్తుండగా వెనుక చక్రం ఊడిపోయి.. వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టిన ఘటన శంషాబాద్‌ బాహ్యవలయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రమాదంలో కారులో ఉన్న.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పల్టీలు కొట్టిన కారు.. నలుగురికి తీవ్ర గాయాలు
పల్టీలు కొట్టిన కారు.. నలుగురికి తీవ్ర గాయాలు

By

Published : Sep 21, 2020, 8:25 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ బాహ్యవలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఏపీ 12ఎం1304 నంబరు గల ఇండికా కారు అతి వేగంగా వెళ్తుండగా వెనుక చక్రం ఊడిపోయింది. దీంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది.

క్షతగాత్రులు

ఆ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులు అరుణ్, నరేష్, ధన్యాల్, తిరుపతి, రాజులుగా గుర్తించిన పోలీసులు 108 సాయంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరంతా నార్సింగి వాసులుగా పోలీసులు తెలిపారు.

అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు

ఇదీ చదవండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి కారు బోల్తా.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details