హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. మిథానిలో ఔట్ సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ యాసీన్.. రక్షపురం ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అకస్మాత్తుగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో యాసిమ్కు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే స్థానికులు యాసీన్‌ను ఆసుపత్రికి తరలించారు.
అదుపుతప్పి డివైడర్ ఢీకొన్న బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు - రోడ్డు ప్రమాదం వార్తలు పాతబస్తీ
హైదరాబాద్ మిధానిలో ఔట్ సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అదుపుతప్పి డివైడర్ ఢీకొన్న బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు