నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జంకు తండా గ్రామ పంచాయతీ జంగాల కాలనీకి చెందిన పట్టాభి మరొకరితో కలిసి మిర్యాలగూడకు వెళ్లారు. పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతుండగా రైల్వే వంతెన వద్ద ధాన్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్.. ఒకరు దుర్మరణం - మిర్యాలగూడ నేర వార్తలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో గల రైల్వే వంతెన వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టగా... ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్.. ఒకరు దుర్మరణం
దీంతో పట్టాభి అక్కడికక్కడే మరణించాడు. అతనితో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పట్టాభి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:రూ. 25 లక్షలకుపైగా హవాలా డబ్బు స్వాధీనం