జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన కారు పెంబర్తి కోళ్ల ఫారం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న సైకిల్, ద్విచక్రవాహనం, ఆటోలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి.
పెంబర్తి వద్ద కారు బీభత్సం... ఇద్దరు మృతి - జనగామ జిల్లా పెంబర్తి వద్ద రోడ్డు ప్రమాదం
జనగామ జిల్లా హైదరాబాద్- హన్మకొండ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా దూసుకువస్తోన్న కారు ఎదురుగా వస్తోన్న సైకిల్, ద్విచక్రవాహనం, ఆటోలను ఢీ కొనడం వల్ల ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యవాతపడ్డారు.
పెంబర్తి వద్ద కారు బీభత్సం... ఇద్దరు వ్యక్తులు మృతి
మృతులు పెంబర్తి గ్రామనికి చెందిన నర్సయ్య, లింగాల ఘన్పూర్ మండలం కళ్లెం గ్రామానికి చెందిన ఆనంద్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఘటన స్థలానికి చేరుకుని ఏసీపీ వినోద్ కుమార్ ప్రమాదంపై విచారణ చేపట్టారు.
ఇదీ చదవండీ...అనంతపురం - న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభం