నిజామాబాద్ జిల్లా పెగడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సాయిలు అనే వ్యక్తి బోధన్ పట్టణనానికి వచ్చి వెళ్తుండగా ఎదురుగావస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. అయితే ఎదురుగా వచ్చిన వాహనదారు లంగ్డాపూర్కు చెందిన యువకుడిగా పోలీసులు భావిస్తున్నారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... మాజీ సర్పంచ్ మృతి - నిజామాబాద్ జిల్లా నేర వార్తలు
నిజామాబాద్ జిల్లా పెగడపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పెగడపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సాయిలు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... మాజీ సర్పంచ్ మృతి
ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రహదారంతా పెద్దపెద్ద గుంతలతో ఉండడం వల్లే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:లద్ధాఖ్‌లో కొండ చరియలు విరిగిపడి జవాన్ మృతి