పండగ జరుపుకుని ఆనందగా పట్నం బయలుదేరిన అతడికి అదే అతడికి చివరి పండగ అయింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం, శెట్టి పాలెం గ్రామం వద్ద అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై ప్రమాదవశాత్తు లారీ బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
పండగ జరుపుకుని తిరిగి వస్తూ..
నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఐతే చరణ్ హైదరాబాద్లో ఓ మల్టీ మీడియా సంస్థలో పని చేస్తున్నాడు. సంక్రాంతి పండగ కోసం సొంత గ్రామానికి వెళ్లాడు. పండగ ముగించుకుని తన స్నేహితురాలైన తెనాలి పట్టణానికి చెందిన కృష్ణ కీర్తితో కలిసి హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యాడు.