మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని నత్నాయిపల్లి గ్రామ పంచాయతిలో పని చేస్తున్న మహేశ్, రమేశ్ ట్రాక్టర్లో డీజిల్ కోసం ద్విచక్ వాహనంపై నర్సాపూర్ వెళ్లారు. అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న పెట్రోల్ బంక్‌కు వెళుతుండగా.. సంగారెడ్డి వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ.. బైకును ఢీ కొట్టింది.
బైకును ఢీ కొట్టిన లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు - మెదక్ జిల్లా తాజా వార్తలు
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో బైకుపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది.
బైకును ఢీకొట్టిన లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... లారీ డ్రైవర్ వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్య నారాయణ తెలిపారు.
ఇదీ చూడండి.. ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు..