సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారిపై పిస్తా హౌస్ సమీపంలో ప్రమాదం జరిగింది. యూ టర్న్ తీసుకుంటున్న లారీని ద్విచక్ర వాహనదారుడు వేగంగా వచ్చి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన రాజు, ఆంజనేయులుగా గుర్తించారు.
ముత్తంగిలో రోడ్డు ప్రమాదం.. అతివేగంతో టిప్పర్‌ను ఢీకొని ఇద్దరి మృతి.. - సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ముత్తంగిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..
అయితే తొలుత పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై సందిగ్ధంలో ఉన్నప్పటికీ సీసీ ఫుటేజ్‌లో ద్విచక్ర వాహనదారుడు లారీని ఢీ కొట్టినట్టుగా సీసీ కెమెరాలో రికార్డయింది. మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Dec 13, 2020, 9:26 AM IST