తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ట్రాక్టర్​ బోల్తా పడి ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు.. - ట్రాక్టర్​ బోల్తా

ట్రాక్టర్​ బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మోతె శివారులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

road accident at mothe in kamareddy district
ట్రాక్టర్​ బోల్తా పడి ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు..

By

Published : Oct 31, 2020, 7:13 PM IST

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మోతె గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ముస్తాపూర్ గ్రామానికి చెందిన రాజు ట్రాక్టర్​ డ్రైవర్​గా పని చేస్తున్నాడు.

ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన రాయి తీసుకురావడానికి రాజుతో పాటు ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు మోతె గ్రామానికి వెళ్తున్నారు. మోతె శివారులో వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్​ అదుపుతప్పి బోల్తా పడింది. రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు రాజుకు భార్య, ఒక కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:'మేం ఎమ్మెల్యే మనుషులం... మాకు ఎదురులేదు'

ABOUT THE AUTHOR

...view details